కావాలని బద్నాం చేస్తున్నారని ఫైర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్య సభ సభ్యుడు బోయినపల్లి సంతోష్ రావుకు కోలుకోలేని షాక్ తగిలింది. భూ కబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు గతంలో ఉన్నాయి. తాజాగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో మనోడిపై కేసు నమోదైంది. రోడ్ నెంబర్ 14లో ఉన్న ల్యాండ్ కబ్జా చేసేందుకు సంతోష్ రావు ప్రయత్నం చేశారంటూ ఫిర్యాదులు అందాయి.
నకిలీ డ్యాకుమెంట్స్ సృష్టించడం, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లను సృష్టించి భూ ఆక్రమణకు ప్రయత్నం చేస్తూ వచ్చారని బాధితులు ఆరోపించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఎన్ఈసీఎల్ కంపెనీకి చెందిన భూమిని అక్రమంగా చొరబడి రూములు నిర్మించారంటూ సదరు కంపెనీ ఆరోపించింది.
సదరు కంపెనీ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంపీ సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి , శ్రీధర్ పై బంజారా హిల్స్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. సంతోష్ రావుపై 420, 468, 471, 447, 120, ఆర్/డబ్ల్యు, 34 ఐపీసీ కింద కేస్ నమోదు చేసినట్లు వెల్లడించారు.