కోలుకోలేని షాక్ ఇచ్చిన పోలీసులు
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కోడి పందెం కేసుకు సంబంధించి ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మొయినాబాద్ పోలీసులు. గత నెలలో తోల్కట్ట లోని ఫామ్ హౌస్ లో భారీగా కోడి పందేలు నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. దాడులు చేయడంతో ఎమ్మెల్సీ వ్యవహారం బయటకు వచ్చింది. కోడి పందేలతో పాటు కేసినో కూడా ఆడినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయినా ఆయన పట్టించు కోలేదంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. అటు ఏపీలో కూడా సేమ్ సీన్ కొనసాగుతోంది. తమపై కావాలని లేనిపోని కేసులు నమోదు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఇదంతా కావాలని కక్ష సాధింపుతో చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తనకు కోడి పందేలు, కాసినోతో ఎలాంటి సంబంధం లేదన్నారు.