Tuesday, April 22, 2025
HomeNEWSNATIONALఅధికారం శాశ్వ‌తం కాదు - చంపై సోరేన్

అధికారం శాశ్వ‌తం కాదు – చంపై సోరేన్

ఆద‌రించినందుకు ధ‌న్య‌వాదాలు

జార్ఖండ్ – జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరేన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం హేమంత్ సోరేన్ తో విభేదించారు. చివ‌ర‌కు త‌న‌కు ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. విధిలేక భార‌తీయ జ‌న‌తా పార్టీతో స‌త్ సంబంధం పెట్టుకున్నారు. తాజాగా రాష్ట్రంలో హోరా హోరీగా ఎన్నిక‌లు జ‌రిగాయి. కానీ మ‌రోసారి సోరేన్ జెండా ఎగుర వేశారు. ఆయ‌న ఎల్లుండి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా బీజేపీతో క‌లిసి రాష్ట్రంలో కొలువు తీరాల‌ని అనుకున్న చంపై సోరేన్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ సంద‌ర్బంగా ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం చంపై సోరేన్ త‌న ఎక్స్ ఖాతాలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

అధికారం అన్న‌ది శాశ్వ‌తం కాద‌ని పేర్కొన్నారు. తాము ముందే చెప్పినట్లు, జార్ఖండ్‌లో నానాటికీ పెరుగుతున్న బంగ్లాదేశ్ చొరబాట్లకు వ్యతిరేకంగా త‌మ‌ ఉద్యమం కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు. రాజకీయ లేదా ఎన్నికల సమస్య కాదన్నారు.

ఈ వీరుల భూమిపై చొరబాటుదారులకు ఎలాంటి రక్షణ ఉండ కూడదని తాము స్పష్టంగా విశ్వసిస్తున్నామ‌ని పేర్కొన్నారు చంపై సోరేన్. పాకుర్ , సాహిబ్‌గంజ్‌తో సహా అనేక జిల్లాల్లో గిరిజన సంఘం మైనారిటీగా మారిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మట్టి కుమారుల భూములను, అక్కడ నివసించే కోడళ్లు, ఆడపడుచుల గౌరవాన్ని కాపాడు కోలేక పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, పార్టీలు ఏర్పడతాయి, రద్దు చేయబడతాయి కానీ మన సమాజం ఉండాల‌ని, లేక పోతే మ‌న మ‌నుగ‌డ‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments