స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కొడుకు
తెలంగాణ మంత్రి కొడుకు నిర్వాకం
హైదరాబాద్ – స్మగ్లింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర సమాచార , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకు కస్టమ్స్ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి పుత్రరత్నం వాచీలను దొంగతనంగా తీసుకు ఇండియాకు తీసుకు వచ్చాడు. వీటి విలువ సుమారు రూ. 1.7 కోట్లు చేస్తుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా వాచీల స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కస్టమ్స్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మంత్రి పొంగులేటి నివాసంలో తనిఖీలు చేపట్్టారు. దాదాపు 6 గంటలకు పైగా తనిఖీలు చేపట్టారు చెన్నైకి చెందిన కస్టమ్స్ శాఖ.
ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడు పొంగులేటి హర్ష రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 4న విచారణకు రావాల్సిందిగా రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే తాను డెంగ్యూ ఫీవర్ తో బాధ పడుతున్నట్లు కస్టమ్స్ శాఖకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై సంతృప్తి చెందక పోవడంతో రంగంలోకి దిగారు.
కాగా ముబిన్ అనే స్మగ్లర్ నుండి రెండు బ్రాండెడ్ వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.