ప్రకటించిన రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి
ఖమ్మం జిల్లా – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఈనెల 15 లోపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నామన్నారు. పార్టీకి చెందిన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదని, హస్తం హవా కొనసాగాలని కోరారు.
ఇదిలా ఉండగా ఆరు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ కు ఈ పంచాయతీ ఎన్నికలు సవాల్ గా మారాయి. ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంది. హామీల అమలులో ఆలస్యం కావడం, నిధుల లేమితో సతమతం కావడంతో పరిస్థితి గ్రామాలు, పట్టణాలలో తిరగలేని పరిస్థితి నెలకొంది.
ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఈ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలనపై నిర్వహించిన పోల్ సర్వేలో ఫామ్ హౌస్ పాలనకే జనం జై కొట్టారు. దీంతో ఖంగుతిన్నారు రేవంత్ రెడ్డి. ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం కూడా కలకలం రేపింది.