NEWSTELANGANA

కేటీఆర్ కు అరెస్ట్ భ‌యం ప‌ట్టుకుంది

Share it with your family & friends

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కామెంట్

హైద‌రాబాద్ – రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పై నిప్పులు చెరిగారు. కేటీఆర్ కు అరెస్ట్ భ‌యం ప‌ట్టుకుంద‌ని అన్నారు. అందుకే హైద‌రాబాద్ నుంచి మ‌కాం ఢిల్లీకి మార్చారంటూ ఎద్దేవా చేశారు.

ఒక్క కేసుకే బెంబేలెత్తి పోతున్నాడ‌ని, గ‌త్యంత‌రం లేక దాక్కునేందుకు ఢిల్లీకి పారి పోయాడంటూ ఫైర్ అయ్యారు. త‌ప్పు చేయ‌క పోతే ఇక్క‌డే ఉండే వాడ‌ని, ఎవ‌రిని మెస్మ‌రైజ్ చేసేందుకు వెళ్లాడో త‌న‌కే తెలియాల‌ని అన్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.

ఒక్క కేసుకే కంగారు ప‌డితే ఎలా అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. ఇంకా చాలా కేసులు న‌మోదు అవుతాయ‌ని, తెలంగాణ రాజ‌కీయాల‌లో పెను మార్పులు రాబోతున్నాయ‌ని జోష్యం చెప్పారు. అందుకే తాను బాంబులు పేల బోతున్నాయ‌ని ముందే ప్ర‌క‌టించాన‌ని అదే ఇదంటూ పేర్కొన్నారు మంత్రి.

రాబోయే రోజుల్లో.. పది సంవత్సరాలలో జరిగిన అక్రమాలు బయటికి వస్తే.. కేటీఆర్ అంతరిక్షంలోకి వెళ్లి దాక్కుంటారేమో అనిపిస్తోందంటూ సెటైర్ వేశారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.

కేటీఆర్, భూమి మీద కంటే అంతరిక్షంలోనే సేఫ్టీగా ఉంటుందని, అంతరిక్షంలో దాక్కుంటారేమో అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. గ‌వ‌ర్న‌ర్ నుంచి క్లియ‌రెన్స్ వ‌స్తుంద‌ని తెలిసి ..భ‌య‌ప‌డి ఢిల్లీలో మ్యానేజ్ చేసుకునేందుకు వెళ్లి ఉంటాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.