కేటీఆర్ అరెస్ట్ పై పొంగులేటి కామెంట్స్
అరవింద్ కుమార్ పైనా చర్యలు తప్పవు
హైదరాబాద్ – రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. శాసన సభలో నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. కేటీఆర్ అరెస్ట్ కాక తప్పదని పదే పదే చెబుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దానికి వంత పాడుతూ కేబినెట్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇవ్వడాన్ని తప్పు పట్టారు.
చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ పై విచారణ కోసం గవర్నర్ అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల పాటు తెలంగాణ పేరుతో విధ్వంసం చేసి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది కాక తాము ఏదో నిజాయితీపరులమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కల్వకుంట్ల కుటుంబాన్ని ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తమకు ఎవరి పట్లా కక్ష సాధింపు అనేది ఉండదన్నారు. చట్టం పరిధిలోకి వస్తుందని, తాను ఇక ఎక్కువగా మాట్లాడ బోనని చెప్పారు.