అమ్మ వారి సన్నిధిలో నారాయణ..సీఎండీ
దర్శించుకున్న మంత్రి..సంజయ్ కుల్ శ్రేష్ణ
విజయవాడ – ఏపీ పురపాలిక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ణ , ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా మంత్రి, సీఎండీ, ఇతర ఉన్నతాధికారులకు ఆలయ కమిటీ చైర్మన్ , పూజారులు ఘనంగా సాదర స్వాగతం పలికారు. మంత్రి వెంట హడ్కో డీసీపీ ఎం నాగరాజు, రీజినల్ చీఫ్ బీఎస్ఏ మూర్తి కూడా శ్రీ కనక దుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. పండితులు ఆశీర్వచనాలు అందజేశారు మంత్రి పొంగూరు నారాయణ, ఇతర ఉన్నతాధికారులకు.
అమ్మ వారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీ కనక దుర్గమ్మ అమ్మ వారి శేష వస్త్రం, ప్రసాదాలు, చిత్ర పటం అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలు వచ్చినా బెజవాడను ఆదుకున్నది మాత్రం అమ్మ వారేనని, ఆమె చల్లని దీవెనలు రాష్ట్రానికి, ప్రజలకు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.