100 రోజుల్లో 203 అన్న క్యాంటీన్లు
ప్రారంభిస్తామన్న మంత్రి నారాయణ
అమరావతి – ఏపీ పురపాలిక , పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలో కేవలం 100 రోజులలో పేదల ఆకలిని తీర్చేందుకు గాను ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పురపాలిక ప్రాంతాలలో 203 అన్న క్యాటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు పొంగూరు నారాయణ. ప్రధానంగా మున్సిపాలిటీలలో చెత్త , చెదారం ఎక్కువగా పడే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తిస్తామన్నారు.
క్లీనింగ్ చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు మంత్రి. పేదల ఆకలిని తీర్చేందుకు గతంలో తమ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. అనంతరం జగన్ రెడ్డి వచ్చాక వాటిని తుంగలో తొక్కాడని ఆరోపించారు. తాము తిరిగి అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు పొంగూరు నారాయణ.