NEWSANDHRA PRADESH

రాజ‌ధాని ప‌నులు తిరిగి ప్రారంభం – నారాయ‌ణ

Share it with your family & friends

చంద్ర‌బాబు హ‌యాంలో తిరిగి ప్రారంభం
అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న అమ‌రావ‌తి రాజ‌ధాని భ‌వ‌న నిర్మాణ ప‌నులు తిరిగి ప్రారంభం కావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.

గత ఐదేళ్లూ రాజధాని రైతులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నార‌ని, జ‌గ‌న్ రెడ్డి ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిల‌బడ్డార‌ని, కూట‌మి ప్ర‌భుత్వం రావ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని కొనియాడారు పొంగూరు నారాయ‌ణ‌.

మొక్కవోని దీక్షతో మహిళలు సైతం స్వచ్చందంగా భాగస్వామ్యమై మహా ధర్నాలతో ఉద్యమించార‌ని ప్ర‌శంసించారు. వారి మేలు ఈ జ‌న్మ‌లో మ‌రిచి పోలేమ‌న్నారు పొంగూరు నారాయ‌ణ‌. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అమరావతి రాజధాని నిర్మాణ పనులు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే తిరిగి ప్రారంభమవడం శుభ పరిణామమ‌ని పేర్కొన్నారు మంత్రి.

నాడు రాజధాని మహిళా రైతుల పోరాటంలో పాలు పంచుకోవడం, నేడు అమరావతి రాజధాని నిర్మాణం 2.0లో భాగస్వామ్యం కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు పొంగూరు నారాయ‌ణ‌