రాజధాని అమరావతికి ఢోకా లేదు – పొంగూరు
స్పష్టం చేసిన ఏపీ మంత్రి నారాయణ
విజయవాడ – ఏపీ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతికి వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పూర్తిగా నగరం సేఫ్ జోన్ లో ఉందన్నారు మంత్రి.
కృష్ణా నది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బంది లేదని, వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. రాజధానిలో కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి నిల్వ ఉందని, గతంలో నిర్మించిన ఐకానిక్ భవనాలు, క్వార్టర్ల కు ఎలాంటి ఇబ్బంది లేదని ఐఐటి నిపుణులు నివేదిక ఇచ్చారని చెప్పారు డాక్టర్ పొంగూరు నారాయణ.
విజయవాడ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగి పోతుందని విష ప్రచారం చేసిందని ఆరోపించారు.
అమరావతికి ముంపు లేకుండా రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం చేపట్టామన్నారు. అమరావతి నగరం రాజధానికి పనికి రాదని గత ప్రభుత్వం ప్రచారం చేయడంతో పాటు ప్రపంచ బ్యాంకు కు కూడా నిధులు ఇవ్వొద్దని లేఖలు రాయడం దారుణమన్నారు .
కృష్ణా నదికి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ కలగ లేదన్నారు.
అమరావతి డిజైన్ సమయం లోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్లు ప్రతిపాదనలు చేశామన్నారు. కొండవీటి వాగు, పాల వాగు ల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైవ్ చేశామని మంత్రి చెప్పారు.
వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కెనాల్స్ ను పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు.
అనంతవరం నుంచి ఉండవల్లి వరకు 23.6 కిమీలతో కొండవీటి వాగు, దొండపాడు నుంచి కృషాయపాలెం వరకూ 16.7 కి.మీ మేర పాల వాగు, వైకుంఠపురం గ్రావిటీ కెనాల్ ను 8 కిమీ మేర అభివృద్ధి చేస్తామన్నారు..
మొత్తం 48.3 కి.మీ మేర ఈ మూడు కాలువలు అభివృద్ధి చేస్తామని ,, వాగులు కొన్ని చోట్ల ఉండాల్సిన దానికంటే కుచించుకు పోయిందన్నారు.
గత వండేళ్లలో కృష్ణా నదికి వచ్చిన వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని మూడు కాల్వలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. వీటితో పాటు 6 రిజర్వాయర్లు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు.