స్పష్టం చేసిన మంత్రి పొంగూరు నారాయణ
గుంటూరు జిల్లా – ఏపీ పురపాలిక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల దెబ్బకు రాజధాని అమరావతి నీళ్లల్లోనే ఉండి పోయింది. ఇంకా కోలుకోలేనేందుకు చాలా రోజులు పట్టేలా ఉంది. అయితే మరోసారి చంద్రబాబు నాయుడు పవర్ లోకి రావడంతో రాజధాని వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
అమరావతి చుట్టే రాజకీయం, వ్యాపారం, వాణిజ్యం కొనసాగుతూ వస్తోంది. దీని చుట్టే వేల కోట్ల వ్యాపారం కొనసాగుతోంది. గతంలో కొలువు తీరిన జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అమరావతిని పూర్తిగా పక్కన పడేసింది. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ బొక్క బోర్లా పడడం, కూటమి సర్కార్ కొలువు తీరడంతో సీన్ మారింది. తిరిగి అమరావతి ఊపిరి పోసుకుంది.
స్వచ్చంధంగా తమ పొలాలను రైతులు ఇవ్వడంతో , వారికి నష్ట పరిహారం భారీ ఎత్తున చెల్లిస్తామని, త్వరలోనే అమరావతి రాజధాని పనులు ప్రారంభం అవుతాయని ఇప్పటికే ప్రకటించారు డాక్టర్ పొంగూరు నారాయణ.
ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇవాళ 10 మంది రైతులు తమ భూములు ఇచ్చేందుకు వచ్చారని చెప్పారు.
భారీ వర్షాల కారణంగా రాజధాని లో నిలిచి పోయిన ముళ్లు కంప తొలగింపు రెండు రోజుల లో ప్రారంభిస్తామని తెలిపారు పొంగూరు నారాయణ.