వరద బాధితుల కోసం ఆహార పదార్థాలు పంపిణీ
పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నామన్న మంత్రి
విజయవాడ – ఏపీ పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అన్నార్థులు, బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారికి అందించే వాటిని తనిఖీ చేశారు పొంగూరు నారాయణ.
వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పలు రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకంగా ప్యాక్ చేయించినట్లు తెలిపారు మంత్రి. ఇదిలా ఉండగా సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్, పంపిణీ తీరును పరిశీలించారు మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ.
ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలు సిద్ధం చేశామని చెప్పారు. ఒక్కో ప్యాకెట్ లో 6 ఆపిల్స్, 6 బిస్కట్ ప్యాకెట్ లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ఉన్నాయని తెలిపారు.
వరద బాధితులకు అందరికీ అందేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు పొంగూరు నారాయణ. ఇందులో బాగంగా నిత్యావసరాల సరుకులు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
బుడ మేరు గండి పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగిందన్నారు. మరో కొన్ని గంటల్లో గండి పూడ్చివేత పూర్తి కావచ్చన్నారు.