అమరావతిపై సర్కార్ ఫోకస్
ఎప్పుడు పూర్తవుతుందో చెపుతాం
అమరావతి – ఆరు నూరైనా సరే అమరావతి రాజధాని నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికన చేపడతామని స్పష్టం చేశారు రాష్ట్ర పురపాలిక, పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి కేవలం ఏపీకి రాజధాని మాత్రమే కాదని అది రాష్ట్రానికి సంబంధించిన ఐకాన్ అని స్పష్టం చేశారు.
అంతే కాదు అమరావతి ఐదున్నర కోట్ల ప్రజల ఆర్తి గీతమని, ఆత్మ గౌరవ పతాకమని చెప్పారు. గత ప్రభుత్వం సర్వ నాశనం చేసేందుకు ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరిగి ప్రజా పాలన మొదలైందన్నారు.
జనం ఛీ కొట్టారని, వారిని పక్కన పెట్టారని, ఇక దేశంలోనే అత్యంత సమర్థవంతుడైన నాయకుడిగా పేరు పొందిన నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ ఇక నుంచి అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. శక్తి వంచన లేకుండా అమరావతి రాజధానిని ప్రపంచానికే ఆదర్శ ప్రాయంగా ఉండేలా నిర్మిస్తామన్నారు పొంగూరు నారాయణ.