కబ్జా స్థలాన్ని పరిశీలించిన మంత్రి
స్థలం కోల్పోయిన వారికి ఇళ్లు
అమరావతి – ఏపీ రాష్ట్ర పట్టణ , పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం ఇరగాళలమ్మ ఆలయ సమీపంలో ఉన్న కాపు భవన్ ను కాపు నేతలతో కలిసి సందర్శించారు పొంగూరు నారాయణ.
కాపు భవన్ లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా బాధితులు ఇచ్చిన వినతి పత్రాలను సమర్పించారు. కాపు భవన్ లో కొంత స్థలాన్ని కొందరు కబ్జా చేసినట్లు తన దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు పొంగూరు నారాయణ.
సర్వే చేసి.. కాపు భవన్ స్థలాన్ని తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు మంత్రి. కబ్జాకు గురైన వారికి టిడ్కో గృహాల్లో ఇళ్లు ఇస్తానని పేర్కొన్నారు. భరోసా కల్పిస్తామని అన్నారు. బీసీ భవన్ ను కూడా పరిశీలించి పనులు త్వరలో పూర్తి చేస్తా అని తెలియ జేయడం జరిగిందని స్పష్టం చేశారు డాక్టర్ పొంగూరు నారాయణ.
కబ్జా స్థలాన్ని పరిశీలించిన అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని, బాధితులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. వారందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు ఏపీ మంత్రి.