ఆధారాలు లేకుండా ఆరోపణలు ఏలా..?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, జోగినపల్లికి నోటీసులు
హైదరాబాద్ – ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, టీ న్యూస్ ఛానెల్ , టీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్ కుమార్, నమస్తే తెలంగాణ దిన పత్రిక, పార్టీ చీఫ్ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి , తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లకి లీగల్ నోటీసులు జారీ చేశారు అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు..
ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుందని..అది వినియోగించు కోవడానికి వీలుండదని తెలిపారు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారని , రోడ్ల నిర్మాణానికి ,బ్రిక్స్ తయారీ కి ఉపయోగిస్తారని పేర్కొన్నారు.
ఫ్లై యాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తుందని, ఈ లారీలలో ఎంత ఫ్లై యష్ పోతుంది అనేది అన్లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగల్సింది పోయి హుజురాబాద్ లో కౌశిక్ లారీలను ఆపి మంత్రిపై ఆరోపణలు చేశారని ఆరోపించారు.