NEWSTELANGANA

బండికి పొన్నం బహిరంగ లేఖ

Share it with your family & friends

అభివృద్ది ప‌నుల‌పై ఫోక‌స్ పెట్టండి

హైద‌రాబాద్ – కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కు బ‌హిరంగ లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఇద్ద‌రూ క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన వారే కావ‌డం విశేషం.

కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టినందుకు అభినందిస్తున్నాన‌ని ఇదే స‌మ‌యంలో క‌రీంన‌గ‌ర్ జిల్లా తో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి స‌హ‌కారం అందించాల‌ని, నిధులు మంజూరు అయ్యేలా చూడాల‌ని మంత్రి పొన్నం కోరారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్‌లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మెరుగు పరచడంలో కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును అందించేందుకు త‌మ స‌ర్కార్ క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.

రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెర వేర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతత‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. రాష్ట్రానికి కేంద్రం నిధులు తీసుకు రావడంలో కేంద్ర మంత్రిగా మీ పాత్ర చాలా కీలకమైన‌ద‌ని గుర్తు చేశారు.

ఈ సంద‌ర్బంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల‌ని, మిడ్ మానేరు , గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసిత భాదిత కుటుంబాలను ఆదుకోవాల‌ని, సూక్ష్మ ,చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాల‌ని కోరారు.