కుల గణన సర్వే చరిత్రాత్మకం
స్పష్టం చేసిన మంత్రి పొన్నం
హైదరాబాద్ – తమ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజీవ్ గాంధీ సూచనల మేరకు బీసీ కుల గణన సర్వేకు సంబంధించి తీర్మానం చేయడం జరిగిందన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. తాము మాటలు చెప్పడం లేదని చేసి చూపిస్తామని దీని ద్వారా నిరూపితమైందన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు గానే తీర్మానం ప్రవేశ పెట్టాంమన్నారు. సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. శనివారం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు మేమెంతో మాకంత అన్న విధంగా కుల గణనకు శ్రీకారం చుట్టామన్నారు.
మాట ఇచ్చామని, దానిని నెరవేర్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. ఎన్ని అ్డంకులు వచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. కుల గణనను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నామని అన్నారు.
తాము ఎవరికి వ్యతిరేకం కాదన్నారు… అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. సామాజిక ,రాజకీయ, ఉద్యోగాల్లో ఎదగాలని తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన సకల జనుల సర్వే నివేదికను ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు.