NEWSTELANGANA

పంచాయ‌తీల‌ను బ‌లోపేతం చేస్తాం

Share it with your family & friends

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్

హైద‌రాబాద్ – త‌మ ప్ర‌భుత్వం నిర్వీర్య‌మై పోయిన గ్రామ పంచాయ‌తీల‌ను బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తుంద‌ని చెప్పారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. స‌ర్పంచ్ లు, మాజీ స‌ర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు స‌భ్యులు త‌మ ప‌వ‌ర్ లోకి రావ‌డానికి ఎంతగానో కృషి చేశార‌ని అన్నారు. మీ అంద‌రి స‌హకారం లేకుంటే ప‌వ‌ర్ లోకి రాలేక పోయే వార‌మ‌న్నారు.

తెలంగాణ వస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయ‌ని అనుకున్నామ‌ని, కానీ కేసీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ స‌ర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చింద‌ని ఆరోపించారు. పంచాయ‌తీ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేశార‌ని వాపోయారు.

బిల్లులు రాక స‌ర్పంచ్ లు ఇబ్బందులు ప‌డ్డార‌ని, మ‌రికొంద‌రు త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డ్డారంటూ పేర్కొన్నారు. ఆనాడు దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌యాంలో గ్రామ పంచాయ‌తీల‌ను మ‌రింత బలోపేతం చేసేందుకు కృషి చేశార‌ని పేర్కొన్నారు.

రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ద్వారా మీనాక్షి నటరాజన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఆమె పార్ల‌మెంట్ లో తెలంగాణ కోసం మ‌ద్ద‌తుగా నిలిచార‌ని చెప్పారు.