వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం – పొన్నం
మూసీ బఫర్ జోన్, FTLను ముట్టు కోలేదు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన దాడులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతున్నది వాస్తవమేనని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కేవలం సర్వే మాత్రమే చేశామని, కూల్చడం జరగలేదన్నారు.
రూ.5,500 కోట్లతో మూసీకి గోదావరి నీళ్లు తెచ్చే ఆలోచనలో ఉన్నామని ప్రకటించారు పొన్నం ప్రభాకర్ గౌడ్. కానీ తాము చేస్తున్న మంచి పనులను గుర్తించకుండా కావాలని తమను బద్నాం చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు మంత్రి.
సామాజిక మాధ్యమాలలో అనుచిత వ్యాఖ్యలు చేసినా, లేదా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేసినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
కేసులు నమోదు చేస్తామని, చర్యలు తీసుకుంటామని, జర జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.