NEWSTELANGANA

కొండా సురేఖ‌ ఒంట‌రి కాదు – పొన్నం

Share it with your family & friends

రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి కామెంట్స్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న ఆయ‌న ఇవాళ మాట‌ల డోస్ పెంచారు. నేరుగా తెలుగు సినీ రంగాన్ని ప్ర‌శ్నించారు.

సినిమా వాళ్ల‌కు సంబంధించిన ఎపిసోడ్ విష‌యంలో తమ ప్ర‌భుత్వం సంయ‌మ‌నం పాటిస్తోంద‌న్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఇదే స‌మ‌యంలో మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంరించు కుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేసింద‌న్నారు.

అయినా కావాల‌ని సినిమా వాళ్లు ర‌చ్చ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. కావాల‌ని చ‌ర్చోప చ‌ర్చ‌లకు దారి తీసేలా కామెంట్స్ చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

కొడా సురేఖ ప‌ట్ల సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్ట్ లు చేస్తున్న వారు, కామెంట్స్ చేసిన వారిపై కూడా సినిమాకు చెందిన వారు స్పందిస్తే బావుండేద‌ని హిత‌వు ప‌లికారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన మంత్రి అయిన కొండా సురేఖ ఒంట‌రిగా ఉంద‌ని అనుకుంటే పొర‌పాటు అని హెచ్చ‌రించారు. ఆమె వెనుక చాలా బ‌ల‌గం ఉంద‌నే విష‌యం మ‌రిచి పోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.