హైదరాబాద్ లో నీటి సమస్య లేదు
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
హైదరాబాద్ – తమ ప్రభుత్వం నగర అభివృద్దికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని ప్రకటించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ అభివృద్దిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడికి ఎలాంటి సమస్య లేదన్నారు.
తాగు నీటి సమస్య లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అయితే జీహెచ్ఎంసీలో రెవిన్యూ పెంచుకునేందుకు ప్రత్యేక పాలసీతో ముందుకు వెళతామని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు ఇబ్బంది లేకుండా ముందుకు వెళతామని చెప్పారు పొన్నం ప్రభాకర్.
పట్టణ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తీసుకునే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర సర్కార్ తో తమకు విభేదాలు లేవన్నారు. అభివృద్ది కోసం కలిసి కట్టుగా ముందుకు సాగుతామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి పై రోజూ వారీగా సమీక్షలు…సమస్యల పై రిపోర్ట్ తయారీ ఉంటుందన్నారు.
గత ప్రభుత్వం తరహాలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధుల కేటాయింపు ఉంటుందన్నారు.
సమస్యల పై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశించామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ల పై త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన చేస్తుందన్నారు.