జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ – రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని అన్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత మాజీ సీజేఐ ఎన్వీ రమణ గొప్ప నిర్ణయం వెలువరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఈ సందర్బంగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.