ENTERTAINMENT

త‌ల‌ప‌తి కోసం ఎదురు చూస్తున్నా

Share it with your family & friends

పూజా హెగ్డే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ – అందాల ముద్దుగుమ్మ బుట్ట బొమ్మ‌గా అంద‌రికీ సుప‌రిచితురాలైన పూజా హెగ్డే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా త‌న ఖాతాలో త‌ల‌ప‌తి విజ‌య్ తో క‌లిసి పంచుకున్న అరుదైన ఫోటోల‌ను పంచుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

త‌మిళ సినీ రంగానికి చెందిన సూప‌ర్ స్టార్ గా పిలిచే త‌ల‌ప‌తి విజ‌య్ తో మ‌రోసారి తెర‌ను పంచుకోనుంది ఈ చిన్న‌ది. విచిత్రం ఏమిటంటే విజ‌య్ త‌న సినీ కెరీర్ లో ఇదే ఆఖ‌రి చిత్రం అని ముందే ప్ర‌క‌టించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతోంది. సినిమాకు సంబంధించి కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

త‌ల‌ప‌తి విజ‌య్ 69 చిత్రానికి సంబంధించి న‌టీ న‌టుల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో విజ‌య్ తో పాటు పూజా హెగ్డే, ప్రియ‌మ‌ణి, బాబీ డియోల్, ప్ర‌కాశ్ రాజ్ తో పాటు మ‌రికొంద‌రు కూడా ఉన్నారు. తొలిసారిగా మ‌ల‌యాళంకు చెందిన న‌టిని కూడా ఎంపిక చేశారు.

ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు ద‌ర్శ‌కుడు హెచ్ వినోత్. మొత్తంగా పూజా హేగ్డే తెగ ముచ్చ‌ట ప‌డుతోంది. విజ‌య్ తో క‌లిసి ప‌ని చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్న‌ట్లు తెలిపింది. గ‌తంలో ఆమె త‌ల‌పతితో బీస్ట్ మూవీలో న‌టించింది.