ENTERTAINMENT

పూన‌మ్ పాండేను కాటేసిన క్యాన్స‌ర్

Share it with your family & friends

32 ఏళ్ల వ‌య‌సులో క‌న్ను మూసిన న‌టి

ముంబై – ప్ర‌ముఖ న‌టి పూన‌మ్ పాండే మ‌ర‌ణంతో ఒక్క‌సారిగా బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె వ‌య‌సు 32 ఏళ్లు. సోష‌ల్ మీడియాలో ఆమె వైర‌ల్ గా మారారు. గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ తో గ‌త కొంత కాలం నుంచి ఇబ్బంది ప‌డుతోంద‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని మొద‌ట ఇన్ స్టా గ్రామ్ లో వెల్ల‌డించారు.

శ‌నివారం పూన‌మ్ పాండే టీం మృతి చెందింద‌న్న విష‌యాన్ని ధృవ‌క‌రించింది. మోడ‌ల్ గా , రియాలిటీ స్టార్ గా పూన‌మ్ పాండే గుర్తింపు పొందారు. త‌ను ధైర్యంగా ఎదుర్కొంద‌ని, కానీ గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ త‌న‌ను క‌బ‌ళించి వేసింద‌ని స‌న్నిహితులు వాపోయారు.

ఇదిలా ఉండ‌గా పూన‌మ్ పాండే స్వ‌స్థ‌లం మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని కాన్పూర్. ఆమె మార్చి 11, 1991లో పుట్టారు. 2013లో తొలిసారిగా న‌షా అనే హిందీ చిత్రంలో న‌టించారు. 2011లో క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌ర్బంగా సెన్సేష‌న్ గా మారారు. ఒక‌వేళ టీమిండియా గ‌నుక క‌ప్ గెలిస్తే తాను దుస్తులు విప్పి న‌గ్నంగా ఊరేగుతానంటూ ప్ర‌క‌టించారు. దీంతో ఒక్క‌సారిగా నేష‌న‌ల్ స్టార్ గా మారింది. మొత్తంగా ఆమె మ‌ర‌ణం తీవ్ర విషాదాన్ని నింపింది.