పోసాని నిర్ణయం పాలిటిక్స్ కు దూరం
ఇక నుంచి ఎలాంటి కామెంట్స్ చేయను
అమరావతి – ప్రముఖ నటుడు, వైసీపీ నాయకుడు , మాజీ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి తాను ఎవరి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయనంటూ స్పష్టం చేశారు. ఈ క్షణం నుంచే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ , నారా భువనేశ్వరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణ మురళి. ఆయనతో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, గుడివాడ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దారుణమైన కామెంట్స్ చేశారు.
ఈ తరుణంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మారడం తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి సర్కార్ కొలువు తీరింది. దీంతో పోసానితో పాటు ఇతరులపై కేసులు నమోదు చేశారు. వీరంతా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు పోసాని కృష్ణ మురళి. మీడియాతో మట్లాడిన తాను పాలిటిక్స్ కు దూరంగా ఉంటానని, జీవితాంతం ఎవరి గురించి మాట్లాడనంటూ ప్రకటించి..అందరిని విస్తు పోయేలా చేశారు.