బెయిల్ మంజూరు చేసిన కోర్టు
అమరావతి – ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి బిగ్ రిలీఫ్ దక్కింది. తనకు బెయిల్ మంజూరు చేసింది నరసరావుపేట కోర్టు మెజిస్ట్రేట్. పోసాని తరఫున వాదనలు వినిపించిన వైసీపీ లీగల్ టీమ్ న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు. వాదనలు విన్న అనంతరం కీలక తీర్పు వెలువరించారు. దాంతో పాటు రూ.10 వేలు పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా లోకేష్, భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 17 కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక సీన్ మారింది. వైసీపీకి చెందిన సీనియర్ నేతలకు చుక్కలు చూపిస్తోంది. గతంలో ఎన్నికల ప్రచారం సందర్బంగా మంత్రి నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశాడు. తాను రెడ్ బుక్ రాస్తున్నానని, తమ పార్టీకి చెందిన వారిని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో వారి పేర్లను చేరుస్తున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే మాజీ మంత్రులకు కోలుకోలేని షాక్ తగిలింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు.