పోసాని కృష్ణ మురళి భార్య కామెంట్స్
హైదరాబాద్ – నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ పై స్పందించారు భార్య కుసుమలత. తన భర్తకు సంబంధించి ఆరోగ్యం బాగా లేదని చెప్పినా పోలీసులు పట్టించు కోలేదని ఆరోపించారు. రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి తీసుకు వెళ్లారని వాపోయారు. తనకు నోటీసులు ఇస్తే తీసుకోనని చెప్పానని అన్నారు. డే టైమ్ లో తీసుకు వెళ్లవచ్చని , రాత్రి పూట ఎందుకు, ఎక్కడికి తీసుకు వెళుతున్నారంటూ ప్రశ్నించినా పట్టించు కోలేదన్నారు. ఏదో పీఎస్ పేరు చెప్పి ఈడ్చుకుంటూ వెళ్లారని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా కక్ష సాధింపుతోనే నటుడు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్. అధికారం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా కేసులు నమోదు చేయడం, ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో మాట్లాడారు. అరెస్ట్ విషయంలో అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఏపీ లో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు.