NEWSANDHRA PRADESH

బాబూ నీ కొడుకు ఓ తిరుగుబోతు

Share it with your family & friends

పోసాని కృష్ణ ముర‌ళి కామెంట్స్

తాడేప‌ల్లి గూడెం – వైఎస్సార్ సీపీ నేత , ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. ఆయ‌న కొడుకు నారా లోకేష్ బాబుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నీ కొడుకు ఓ తిరుగుబోతు అంటూ మండిప‌డ్డారు. వాలంటీర్లు బాబును న‌మ్మ‌ర‌ని అన్నారు.

జ‌య‌ప్ర‌ద జీవితాన్ని నాశ‌నం చేశాడ‌ని, ఎన్టీఆర్ భార్య‌ను బ‌జారు కీడ్చాడ‌ని మండిప‌డ్డారు. ఆనాడు వంగవీటి రంగా హ‌త్య జ‌రిగిన సంద‌ర్బంలో క‌మ్మ వారిపై దాడులు జ‌రిగితే చంద్ర‌బాబు నాయుడు ఎక్క‌డ దాక్కున్నాడో చెప్పాల‌న్నారు పోసాని కృష్ణ ముర‌ళి.

స్టేలపై బతుకుతున్న చంద్రబాబును జైళ్లో పెట్టండి అని పురందేశ్వరి లేఖలు ఎందుకు రావ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. మహిళా వాలంటీర్లపై అడ్డగోలు ఆరోపణలు చేసిన పవన్ క‌ళ్యాణ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అరేయ్ రామోజీ అన‌డంలో త‌ప్పేమీ లేద‌న్నారు. రోజూ ల‌క్ష్మీ పార్వ‌తి గురించి వ్య‌క్తిగ‌త హ‌న‌నం చేసేలా గ‌లీజు రాత‌లు రాశాడ‌ని ఫైర్ అయ్యారు.

ఆడ‌ది క‌నిపిస్తే ముద్దు పెట్టాలి లేదంటే క‌డుపు చేయాల‌ని బాబు బావ‌మ‌రిది బాల‌కృష్ణ అంటాడ‌ని, ఇలాంటి వాళ్ల‌ను ఎలా ఆద‌రిస్తార‌ని ప్ర‌శ్నించారు పోసాని. వేల కోట్లు దిగ‌మింగిన సుజ‌నా చౌద‌రి గురించి ఇంటింటికి తిరిగి క‌ర‌ప‌త్రాలు పంచుతాన‌ని అన్నారు. క‌మ్మ కులంలో పుట్టినందుకు గ‌ర్వ ప‌డ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు పోసాని కృష్ణ ముర‌ళి.

చంద్ర‌బాబు , సుజనా చౌద‌రి, సీఎం ర‌మేష్ ల దోపిడీ గురించి ఎందుకు పురందేశ్వ‌రి ప్ర‌శ్నించ‌డం లేద‌ని, కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు లేఖ‌లు రాయ‌డం లేదంటూ నిప్పులు చెరిగారు. ఈమె కేవ‌లం త‌న మ‌రిది కోస‌మే బీజేపీలో ప‌ని చేస్తోంద‌న్నారు.