చంద్రబాబు దేవుడి కంటే అతీతుడా..?
నిప్పులు చెరిగిన పోసాని కృష్ణ మురళి
అమరావతి – ప్రముఖ నటుడు, వైసీపీ సీనియర్ నాయకుడు పోసాని కృష్ణ మురళి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. శనివారం పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడారు.
జగన్ మోహన్ రెడ్డిని తిరుమలకు వద్దనే హక్కు చంద్రబాబు నాయుడుకు, ఆయన పరివారానికి, కూటమి నేతలకు లేనే లేదని స్పష్టం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కొండపైకి వెళ్లడానికి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
నారా చంద్రబాబు నాయుడు దేవుడి కంటే అతీతుడా.? తిరుమలకు రావొద్దు అనడానికి ఆయన ఎవరు అంటూ మండిపడ్డారు. పాలనా పరంగా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కూటమి కుట్రలకు తెర లేపిందంటూ సంచలన ఆరోపణలు చేశారు పోసాని కృష్ణ మురళి.
జగన్ మోహన్ రెడ్డి ఏ పాపం చేశాడని హింసిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఆ పైన ఉన్న దేవ దేవుడు, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారే చూసుకుంటారని అన్నారు ప్రముఖ నటుడు.
ప్రజలకు , భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే జగన్ మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు. మరో వైపు ఆర్కే రోజా సెల్వమణి కూడా బాబుపై భగ్గుమన్నారు.