NEWSANDHRA PRADESH

ఏపీ పాలిట విల‌న్ పురందేశ్వ‌రి

Share it with your family & friends

నిప్పులు చెరిగిన పోసాని కృష్ణ ముర‌ళి

అమ‌రావ‌తి – భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆమెపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర సంక్షేమం, ప్ర‌జలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి ఏనాడైనా ప‌ట్టించుకుందా అని నిల‌దీశారు.

ఒక ర‌కంగా చెప్పాలంటే రాష్ట్రం పాలిట ఆమె విల‌న్ గా మారారంటూ మండిప‌డ్డారు పోసాని కృష్ణ ముర‌ళి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని, త‌మ ప‌రివారాన్ని టార్గెట్ చేసిన పురందేశ్వ‌రికి సుజ‌నా చౌద‌రి, చంద్ర‌బాబు నాయుడు, సీఎం ర‌మేష్ చేసిన మోసాలు, దారుణాలు, అప్పుల గురించి ఎందుకు ప్ర‌స్తావించం లేదంటూ నిల‌దీశారు. వీరిపై ఎందుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు, ఎన్నిక‌ల సంఘానికి లేఖ‌లు ఎందుకు రాయ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

జ‌య‌ప్ర‌ద జీవితాన్ని నాశ‌నం చేసిన చ‌రిత్ర చంద్ర‌బాబుది కాదా అని భ‌గ్గుమ‌న్నారు. ల‌క్ష్మీ పార్వ‌తి వ్య‌క్తిత్వాన్ని కించ ప‌ర్చేలా రాత‌లు రాయించింది రామోజీ రావు, రాధాకృష్ణ కాదా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పోసాని కృష్ణ ముర‌ళి.