చిరంజీవి అవకాశవాది
పక్కా బిజినెస్ మెన్
అమరావతి – మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై ప్రముఖ నటుడు , రచయిత పోసాని కృష్ణ మురళి నిప్పులు చెరిగారు. ఆయనకంటూ ఓ స్ట్రాటజీ లేదని పేర్కొన్నారు. బుధవారం పోసాని మీడియాతో మాట్లాడారు. చిరంజీవి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలి పోతాడని ఆరోపించారు.
గతంలో ప్రజా రాజ్యం పెట్టాడని, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడని ధ్వజమెత్తారు. 18 సీట్లు వస్తే తమ వాళ్లు ఎవరూ అమ్ముడు పోరంటూ ప్రగల్భాలు పలికాడని , తీరా చూస్తే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడని మండిపడ్డారు.
కేంద్రంలో సహాయ శాఖ మంత్రి పదవి పొందాడని, రాజ్యసభ సీటు వచ్చిందని ఇదంతా రాజకీయం కాదా అని ప్రశ్నించారు. మరో ఛాన్స్ లేక పోవడంతో సినిమాలు చేసుకుంటూనే తనదైన స్టైల్ లో అందరితో సఖ్యతగా ఉంటూనే తన పనులు తాను చేసుకుంటూ పోయాడని ధ్వజమెత్తారు.
ఇప్పుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడని మండిపడ్డారు పోసాని . పవన్ కళ్యాణ్ కు ఓటు వేయమంటూ వీడియో సందేశం ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. చిరంజీవి పచ్చి అవకాశ వాది అని షాకింగ్ కామెంట్స్ చేశారు.