పవన్ కళ్యాణ్ పై పోతిన కన్నెర్ర
పచ్చ నోట్లు పడేస్తే మరిచి పోతారా
విజయవాడ – జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. తాను ముందు నుంచి పార్టీ కోసం కష్ట పడ్డానని, చివరి దాకా టికెట్ ఇస్తామని చెప్పి తీరా పొత్తు పేరుతో తనకు టికెట్ రాకుండా చేశారంటూ ధ్వజమెత్తారు. మంగళవారం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు.
కన్న తల్లిని విమర్శించిన వాళ్లకు, పచ్చ నోట్ల కట్టలు పడేసిన వాళ్లకు ఎలా మద్దతు ఇస్తారంటూ ప్రశ్నించారు. కన్న తల్లి అంజనమ్మను దూషించిన ఛానల్ కు ఫండింగ్ చేసిన సుజనా చౌదరిని గెలిపిస్తా అని మీరు హామీ ఇచ్చారంటే మిమ్మల్ని ఏమని అనుకోవాలని నిలదీశారు పోతిన మహేష్.
పొత్తుల పేరుతో తనను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది న్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. జనసేన పార్టీ తనను నిట్ట నిలువునా ముంచిందని మండిపడ్డారు. అసలు సుజనా చౌదరికి ఏం అర్హత ఉందంటూ టికెట్ ఛాన్స్ ఇచ్చారంటూ నిలదీశారు పోతిన మహేష్. తాను బరిలో ఉండడం ఖాయమని ప్రకటించారు. గెలవడం పక్కా అని, అప్పుడు తానేమిటో చూపిస్తానని హెచ్చరించారు.