కూటమి సర్కార్ పై ఛార్జ్ షీట్ రిలీజ్
పోతిన వెంకట మహేష్ కామెంట్స్
అమరావతి – ఏపీలో కొలువు తీరిన టీడీపీ కూటమి సర్కార్ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత పోతిన వెంకట మహేష్. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేవలం ప్రచారం తప్పా చేస్తున్నది ఏమీ లేదన్నారు పోతిన వెంకట మహేష్. వచ్చే నెల నవంబర్ 4, 9వ తేదీల మధ్య ప్రజల పక్షాన ఛార్జ్ షీట్ విడుదల చేస్తామని ప్రకటించారు.
ధర్మం గెలవాలంటే కొంచెం సమయం పడుతుందని పేర్కొన్నారు పోతిన వెంకట మహేష్. తాను బీసీననే చాలా సునాయసంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నర్మ గర్భంగా జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మనది పూర్తిగా ప్రజా పక్షమని పేర్కొన్నారు. ప్రజల తరపున వాయిస్ వినిపించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు . పదవుల మీద , అధికారం మీద వ్యామోహం లేనందు వల్లనే తిరిగి ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని అన్నారు పోతిన వెంకట మహేష్.
సమాజం బాగుండాలని నిస్వార్ధంగా పని చేస్తున్నామని అన్నారు. ఇదే సమయంలో …మోకాళ్లపై నిలబడి బతకడం కంటే కాళ్ళపై నిలబడి చావడం మంచిదన్నారు.