అల్లు అర్జున్ ఏం త్యాగం చేశాడు
నిప్పులు చెరిగిన పీఓడబ్ల్యూ సంధ్య
హైదరాబాద్ – నటుడు అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పీఓడబ్ల్యూ నేత సంధ్య. ఆయన దేని కోసం త్యాగం చేశాడని క్యూ కట్టారంటూ ప్రశ్నించారు. పేదల ప్రాణాలంటే లెక్క లేదా అని ప్రశ్నించారు. ఓ తల్లి చని పోయింది. మరో పిల్లాడు చావు బతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతుంటే పరామర్శించేందుకు మనసు రాలేదన్నారు. ఇదేనా మీ హీరోయిజం అని నిప్పులు చెరిగారు.
కేవలం కొన్ని గంటలు జైలులో ఉంటేనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి సదరు హీరోను పరామర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆయన నుంచి సమాజానికి ఏమైనా లాభం చేకూరిందా అని నిలదీశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం పరిపాటిగా మారిందన్నారు.
తమ సినిమా ప్రమోషన్ గురించి చేసుకోవడం తప్పితే పోయిన ప్రాణం తెచ్చి ఇవ్వగలరా అని అన్నారు. సినిమా వాళ్లకు బాధ్యత లేదా అని మండిపడ్డారు సంధ్య. మిమ్మల్ని మీరు హీరోలుగా చెలామణి చేసుకుంటున్నారే తప్పా ఇతరుల గురించి సామాజిక బాధ్యత అనేది ఉంటుందని మరిచి పోతే ఎలా అన్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు బాధ్యత వహించాలన్నారు.
హీరో తన ప్రచారానికి దీనిని వాడుకున్నాడే తప్పా కనీసం పరామర్శించక పోవడం దారుణమన్నారు సంధ్య.