ప్రభ్ సిమ్రాన్ పరేషాన్
4 ఫోర్లు 5 సిక్సర్లు
కోల్ కతా – ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక పోరులో స్వంత గడ్డపై చేతులెత్తేసింది కోల్ కతా నైట్ రైడర్స్. ఆ జట్టు కోచ్ గౌతం గంభీర్ ముఖం తేలి పోయింది. 262 పరుగుల భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. ఐపీఎల్ హిస్టరీలో ఇది ఓ నయా రికార్డ్ కావడం విశేషం.
మైదానంలోకి వచ్చీ రావడంతోనే పంజాబ్ కింగ్స్ ఆకలి కొన్న పులుల్లా రెచ్చి పోయారు. కోల్ కతా బౌలర్లను తొలి బంతి నుంచే దాడి చేయడం మొదలు పెట్టారు. దీంతో ఒకే ఒక్క మ్యాచ్ లో ఏకంగా ఇరు జట్లు కలిసి 37 ఫోర్లు 42 సిక్సర్లు బాదాయి. ఇది కూడా చరిత్రనే.
ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం 18.4 బంతుల్లో పని పూర్తి కానిచ్చేశారు. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ కోల్ కతాకు చుక్కలు చూపించాడు. 20 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ క్రికెటర్ 54 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ యంగ్ క్రికెటర్ కొట్టిన దెబ్బకు కోల్ కతా బౌలర్లు నీరస పడి పోయారు.
జానీ బెయిర్ స్టో 48 బంతుల్లో 8 ఫోర్లు 9 సిక్సర్లతో 108 రన్స్ చేశాడు. ఇక యంగ్ క్రికెటర్ శశాంక్ సింగ్ కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. 68 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి.