మా అంచనాలు తప్పవు – గుప్తా
యాక్సిస్ మై ఇండియా చైర్మన్
న్యూఢిల్లీ – యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి సెటైర్ వేశారు. గతంలో తాము ఇచ్చిన ముందస్తు ఎన్నికల ఫలితాలు వాస్తవంలో కరెక్ట్ అని తేలిందన్నారు.
ఇంకొన్ని గంటల్లో భారత దేశానికి సంబంధించి 17వ విడత పోలింగ్ ప్రక్రియ కౌంటింగ్ మొదలు కానుందని తాము ఇచ్చిన ఆయా పార్టీలకు సంబంధించిన అంకెలు తప్పు కావని తేలనుందని స్పష్టం చేశారు. మా అంచనాలు తప్పవని పేర్కొన్నారు ప్రదీప్ గుప్తా.
రాహుల్ గాంధీ సోయి ఉండి మాట్లాడితే బెటర్ అని పేర్కొన్నారు. ఆయన ఆందోళనలో ఉన్నారని, కొంచెం ఓపికతో వింటే బాగుంటుందని సూచించారు. తమకు ఏ పార్టీ పట్ల ప్రేమ ఉండదని అన్నారు. సోమవారం ప్రదీప్ గుప్తా మీడియాతో మాట్లాడారు.
మేం ప్రజల తరపున వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేశామన్నారు. ఒక పార్టీకి వంత పాడుతూ ఫలితాలను ప్రకటించ లేదని చెప్పారు. ఇంకొంచెం సేపు ఆగితే అసలు వాస్తవం ఏమిటో తేలుతుందన్నారు ప్రదీప్ గుప్తా.