NEWSNATIONAL

ప్ర‌జ్వ‌ల్ రేవణ్ణ ప‌రాజ‌యం

Share it with your family & friends

లైంగిక ఆరోప‌ణ‌ల నేప‌థ్యం

క‌ర్ణాట‌క – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హ‌స‌న్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఊహించ‌ని రీతిలో జేడీఎస్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచ‌న ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ ఓట‌మి పాల‌య్యారు. ఆయ‌న‌పై తీవ్ర‌మైన లైంగిక వేధింపులకు గుర‌య్యారు.

ఆయ‌న‌పై కాంగ్రెస్ స‌ర్కార్ కేసు న‌మోదు చేసింది. సీఎం సిద్ద‌రామ‌య్య సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ మేర‌కు విదేశాల‌కు పారి పోవ‌డంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. చివ‌ర‌కు బెంగ‌ళూరు ఎయిర్ పోర్టులో ప్ర‌జ్వ‌ల్ రేవణ్ణ‌ను అదుపులోకి తీసుకున్నారు.

సెక్స్ స్కాండ‌ల్ లో ఇరుక్కున్న ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌చారం చేయ‌డం విస్తు పోయేలా చేసింది. హ‌స‌న్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎం. పాటిల్ చేతిలో రేవ‌ణ్ణ 44,000 వేల ఓట్ల తేడాతో పరాజ‌యం పొందారు.

ప్ర‌జ‌లు ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త‌ను క‌న‌బ‌ర్చ‌డం విస్తు పోయేలా చేసింది. ప్ర‌జా సేవ చేయాల్సిన స‌ద‌రు నాయ‌కుడు ఇలాంటి ప‌నికి మాలిన‌, నీతి మాలిన ప‌నులు చేయ‌డాన్ని జీర్ణించు కోలేక పోయారు.