NEWSNATIONAL

ప్ర‌జ్వ‌ల్ రేవణ్ణ‌పై మ‌రో కేసు

Share it with your family & friends

అత్యాచారం ఆరోప‌ణ‌లు

క‌ర్ణాట‌క – రాష్ట్రంలో రాజ‌కీయాలు ఊహించ‌ని రీతిలో మార్పు చోటు చేసుకుంటున్నాయి. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ భార‌తీయ జ‌న‌తా పార్టీ పొత్తు పెట్టుకున్న జేడీఎస్ ఇప్పుడు సంక‌ట స్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ అభ్య‌ర్థి ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై తీవ్ర‌మైన లైంగిక, అత్యాచార ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌తో పాటు ఎమ్మెల్యే అయిన తండ్రి రేవ‌ణ్ణ‌పై కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో లేడు. దేశం విడిచి పారి పోయిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. సీఎం సిద్ద‌రామ‌య్య కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తండ్రీ కొడుకులు ఇద్ద‌రిపై సిట్ విచార‌ణ‌కు ఆదేశించారు.

ఈ త‌రుణంలో ఇప్ప‌టికే కేసులు న‌మోదు కాగా శుక్ర‌వారం మ‌రో కేసు న‌మోదు చేశారు ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై.
ఐపీసీ 376, 506, 354A(1)(ii), 354(B), 354(C) IT యాక్ట్ కింద రెండో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రజ్వల్ తండ్రి హెచ్‌డి రేవణ్ణపై కూడా మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

కొడుకు ప్రజ్వల్ లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిని కిడ్నాప్ చేసినందుకు అతనిపై కేసు నమోదైంది. ప్రజ్వల్‌ను విడిచిపెట్టమని వేడుకున్న వీడియోలో ఉన్న ఇంటి సహాయకుడి కుమారుడు, తన తల్లి ఏప్రిల్ 29 నుండి కనిపించడం లేదని పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణ ఎలా ఉన్నా హాసన్ లోక్‌సభ సీటును ప్రజ్వల్ రేవ‌ణ్ణ గెలుస్తాడ‌ని అంటున్నారు.