కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికం
వంచిత్ బహుజన్ ఆఘాడీ చీఫ్
ముంబయి – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వంచిత్ బహుజన్ ఆఘాడీ (వీబీఏ) చీఫ్ ప్రకాశ్ అంబేద్కర్ . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొన్నారు. మద్యం పాలసీని మార్చేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని కోర్టు సవాల్ చేయలేదని రాజ్యాంగం స్పష్టం చేసిందని అన్నారు ప్రకాశ్ అంబేద్కర్.
ఒకవేళ కోర్టు సవాల్ చేయలేక పోతే దర్యాప్తు సంస్థలు కూడా ముట్టు కోలేవన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని ఏ వ్యవస్థ సవాల్ చేయలేదని, ఆ అర్హత వాటికి లేదన్నారు వీబీఏ చీఫ్. అసెంబ్లీ ఆమోదించినట్లయితే , పాలసీ విధానంలో కుంభకోణం జరిగినట్లు అయితే దానిపై విచారణ చేపట్టాల్సిన అధికారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఉంటుందన్నారు.
ఒకవేళ పూర్తిగా సీఎం ప్రమేయం ఉందని పేర్కొన్నా, దానికి మంత్రివర్గం కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు ప్రకాశ్ అంబేద్కర్.