Monday, April 21, 2025
HomeNEWSNATIONALఅమిత్ షాపై భ‌గ్గుమ‌న్న ప్ర‌కాశ్ అంబేద్క‌ర్

అమిత్ షాపై భ‌గ్గుమ‌న్న ప్ర‌కాశ్ అంబేద్క‌ర్

వెంట‌నే ప‌ద‌వికి రాజీనామా చేయాలని డిమాండ్

మ‌హారాష్ట్ర – భార‌త రాజ్యాంగ రూప‌శిల్పి డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు అంబేద్క‌ర్ మ‌నుమ‌డు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాచ‌రిక‌పు మ‌న‌స్త‌త్వాన్ని, మ‌ను స్మృతికి మేలు చేకూర్చేలా ఉన్నాయ‌ని ఆరోపించారు. ఏ రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వ‌చ్చారో దానినే కించ ప‌ర్చేలా మాట్లాడ‌టం త‌గ‌ద‌న్నారు. ఇది మంచి ప‌ద్దతి కాద‌న్నారు .

అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ పాత మనస్తత్వాన్ని తెలియ జేస్తోందని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్. రాజ్యాంగ పితామహుడిని గౌరవించడమంటే వాక్ స్వాతంత్య్రాన్ని అంగీకరించడమే కాబట్టి బిఆర్ అంబేద్కర్‌ను కాదని షా వ్యాఖ్యలు సూచిస్తున్నాయని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.
.
ఇదిలా ఉండ‌గా అంబేద్కర్‌పై షా చేసిన వ్యాఖ్యల ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఇండియా కూట‌మి ఎంపీలు. బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు తెప్పి తీరాలంటూ కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షాను డిమాండ్ చేశారు.

బిజెపి ఉనికిలోకి రాక ముందు, రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు దాని పూర్వీకులు జన్ సంఘ్ , ఆర్ఎస్ఎస్ బాబాసాహెబ్‌ను వ్యతిరేకించాయి అని వంచిత్ బహుజన్ అఘాడి అధినేత ప్రకాష్ అంబేద్కర్ ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments