ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్ – ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వైరల్ గా మారారు సోషల్ మీడియాలో. ఆయన తాజాగా అత్యంత ఆసక్తికరమైన ఫోటోను పంచుకున్నారు. సనాతన ధర్మం గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో దేశమంతటా ట్రోలింగ్ కు గురైన ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్, డీఎంకే చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్ తో కలిసి ఉన్న అరుదైన ఫోటోను ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆదివారం పంచుకున్నారు.
ఫోటోను ఉదహరిస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటూ పెట్టారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు. అంతే కాదు నాటకాలు వద్దు, వేషాలు ఇక చాలు..ప్రజల కోసం ఏదైనా పని చేయాలని హితవు పలికారు.
దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఇలా ప్రశ్నించినందుకు ప్రకాశ్ రాజ్ తో పాటు పరోక్షంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి సనతాన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించ లేరని , వారే అడ్రస్ లేకుండా పోతారని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్ జస్ట్ వెయిట్ అండ్ సీ అంటూ అనేసి వెళ్లి పోయారు. ఈ తరుణంలో పుండు మీద కారం చల్లినట్లు ప్రకాశ్ రాజ్ ఫోటో షేర్ చేయడం విస్తు పోయేలా చేసింది.