దేవుళ్లను రాజకీయాల్లోకి లాగితే ఎలా..?
జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ కామెంట్
హైదరాబాద్ – ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా ప్రస్తావించడం విశేషం. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై తాను ఒకటి పేర్కొంటే దానిని పట్టుకుని తనను పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఇదిలా ఉండగా తిరుపతి లడ్డూ వివాదంపై సోమవారం భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ గవాయ్ , జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం సీరియస్ అయ్యింది. ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తీవ్రంగా తప్పు పట్టింది. అసలు విచారణకు మీరే ఆదేశిస్తారు..ఆపై మీరే కల్తీ అయ్యిందంటూ మీడియా సాక్షిగా ప్రకటిస్తారు.. ఇదేం రాజకీయం అంటూ నిప్పులు చెరిగింది ధర్మాసనం.
ఈ సందర్బంగా మీ చెత్త రాజకీయాలకు దేవుళ్లను కూడా లాగితే ఎలా అని సీరియస్ గా ప్రశ్నించింది. దీనినే ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రకాశ్ రాజ్ . ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. జస్ట్ ఆస్కింగ్ ..జస్ట్ ప్లీడింగ్ అంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి ట్వీట్ చేయడం , సుప్రీంకోర్టు యాడ్ పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.