పవన్ కళ్యాణ్ జర చదువుకుంటే బెటర్
డిప్యూటీ సీఎంపై ప్రకాశ్ రాజ్ సెటైర్
హైదరాబాద్ – ఏపీ డిప్యూటీ సీఎం , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్. మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఏం ట్వీట్ చేశానో చదవకుండా అర్థం పర్థం లేకుండా, బాధ్యతా రాహిత్యంతో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
తాను లడ్డూ కల్తీ వ్యవహారం గురించి ప్రస్తావించింది వాస్తవమే అయినప్పటికీ దేశంలో సవాలక్ష సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా , వాటిని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లకుండా రాజకీయం చేయడం సబబు కాదని మాత్రమే పేర్కొన్నానని తెలిపారు ప్రకాశ్ రాజ్.
ఇదిలా ఉండగా శ్రీవారి లడ్డూ విషయంలో ఎవరు కామెంట్స్ చేసిన భక్తులు తీవ్రంగా స్పందిస్తారని , జర జాగ్రత్త అనే అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంతే కాదు తాను ఒక్కడినే కోట్లాది హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పడాన్ని పలువురు తప్పు పట్టారు.
కాగా తాను చెప్పింది ఏంటి..మీరు దాన్ని పూర్తిగా అపార్థం చేసుకుని తిప్పున్నది ఏంటి అంటూ నిలదీశారు. తాను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని, 30 తర్వాత వచ్చాక తాను పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి మాటకు జవాబు ఇస్తానని ప్రకటించారు. అంత వరకు ఓపిక పట్టాలని పవన్ కు హితవు పలికారు.