పవన్ కళ్యాణ్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్
హైదరాబాద్ – ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నిప్పులు చెరిగారు. ఆయన ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశారు. శనివారం ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. బహు భాషలు రావాల్సిన అవసరం ఉందంటూ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. హిందీ భాషను వద్దంటే దానిని ద్వేషించడం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ఎవరికైనా , ఏ ప్రాంతానికైనా ముందు మాతృ భాష ముఖ్యమని స్పష్టం చేశారు ప్రకాశ్ రాజ్. తాను చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. స్వాభిమానంతో మాతృ భాషను కాపాడుకోవడం, తమ తల్లిని రక్షించు కోవడం అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో రెచ్చి పోయారు పవన్ కళ్యాణ్. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అవసరమైతే దేశం కోసం చని పోయేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. తన దృష్టిలో దేశం అంతా ఒక్కటేనని అన్నారు. అందరూ మనుషులుగా మెలగాలని, కొందరు కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. హిందీ భాషను తమిళనాడు రాష్ట్రం వ్యతిరేకించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు జనసేన పార్టీ చీఫ్.