పార్టీ చీఫ్ దళపతి విజయ్ తో కలిసి
తమిళనాడు – తమిళనాడులో రాజకీయాలు శర వేగంగా మారి పోతున్నాయి. గతంలో డీఎంకేను అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు ప్రముఖ రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన గతంలో ఏపీ జగన్ రెడ్డికి కూడా పని చేశారు. ప్రస్తుతం ఎవరూ ఊహించని విధంగా చెన్నైలో ప్రత్యక్షం అయ్యారు. బీహార్ లో పీకే స్వంతంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీని కూడా ఏర్పాటు చేశారు. దానికి జన సురక్ష అని పేరు కూడా పెట్టారు. మీటింగ్ కూడా నిర్వహించారు.
ఈసారి ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని ప్రముఖ నటుడు విజయ్ దళపతి ఆశిస్తున్నారు. ఆ మేరకు ఆయన పార్టీ పేరుతో నిర్వహించిన సభకు ఏకంగా 10 లక్షల మందికి పైగా జనం హాజరయ్యారని అంచనా. ప్రస్తుతం తమిళనాట ఎంకే స్టాలిన్ సర్కార్ నడుస్తోంది. పీకే గత ఎన్నికల్లో డీఎంకే విజయానికి కృషి చేశారు.
కాగా ఇప్పుడు రూట్ మార్చారు. మహాబలిపురంలో దళపతితో కలిసి టీవీకే తొలి వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తను కూడా పాల్గొన్నాడు. ఈ సందర్బంగా వ్యూహాలు, అనుసరించాల్సిన కార్యక్రమాల గురించి విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
ఈ మేరకు తన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గాను ప్రశాంత్ కిషోర్ తో దళపతి బిగ్ డీల్ కుదుర్చుకున్నట్లు టాక్.