NEWSNATIONAL

ప్ర‌శాంత్ కిషోర్ కామెంట్స్

Share it with your family & friends

బీజేపీ గెలుస్తుంద‌ని కామెంట్

హైద‌రాబాద్ – ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారారు. త‌ను రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తూ విస్తు పోయేలా చేస్తున్నారు. ఆయ‌న చేసిన ఏ కామెంట్ కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌రిగాయి. బీఆర్ఎస్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పాడు ప్ర‌శాంత్ కిషోర్. కానీ బీఆర్ఎస్ ను జ‌నం బండ‌కేసి కొట్టారు. ఇక్క‌డ కాంగ్రెస్ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో బీజేపీ గెలుస్తుంద‌ని చెప్పాడు. కానీ అక్క‌డా ఆయ‌న అంచ‌నాలు త‌ప్పాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. విచిత్రం ఏమిటంటే క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాద‌ని, తిరిగి రెండోసారి ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని చెప్పాడు పీకే. అక్క‌డ ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ కొలువు తీరింది. జ‌నం బీజేపీని తిర‌స్క‌రించారు.

బీహార్ లో త‌ను పాద‌యాత్ర చేప‌ట్టాడు. కానీ ఆయ‌న టార్గెట్ అంతా బీజేపీకి మేలు చేసేలా కామెంట్స్ ఉన్నాయే తప్పా ఇంకోటి లేదంటూ మండి ప‌డుతోంది కాంగ్రెస్ పార్టీ. మొత్తంగా పీకే రోజు రోజుకు త‌న చ‌రిష్మాను కోల్పోతున్న‌ట్లు అనిపిస్తోంది. ఏపీలో వైసీపీ ఓడి పోతోంద‌ని సెల‌విచ్చాడు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.