Wednesday, April 23, 2025
HomeNEWSANDHRA PRADESHజ‌గ‌న్ రావ‌డం క‌ష్టం పీకే జోష్యం

జ‌గ‌న్ రావ‌డం క‌ష్టం పీకే జోష్యం

న‌గ‌దు బ‌దిలీ ఒక్క‌టే ఆదుకోదు

న్యూఢిల్లీ – ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌, ఐ ప్యాక్ ఫౌండ‌ర్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నారు. ఏపీ రాజ‌కీయాల‌పై స్పందించారు. అభివృద్దికి ఊతం ఇచ్చేందుకు జ‌గ‌న్ ఏమీ చేయ‌లేద‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు న‌గ‌దు బ‌దిలీ చేసుకుంటూ పోయారే త‌ప్పా నిరుద్యోగుల‌కు జాబ్స్ ఇవ్వ‌లేక పోయాడ‌ని పేర్కొన్నారు. ఇదే ఆయ‌న‌కు మైన‌స్ పాయింట్ కాబోతోంద‌ని చెప్పారు పీకే.

రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే ఒక్క పని కూడా జగన్ చేపట్టలేక పోయారని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. జగన్ ఒక ప్రొవైడర్ గానే ఉండి పోయారని, చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే జగన్ సరి పెట్టారని ప్రశాంత్ కిశోర్ వివరించారు.

ప్రజలకు నగదు బదిలీ చేశారే తప్ప, ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు. ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్ తరహాలోనే జగన్ కూడా పరిపాలన సాగించారని తెలిపారు. అక్క‌డ ఎంత బాగా పాల‌న సాగించినా చివ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ గెలిచిన విష‌యాన్ని గుర్తు చేశారు ప్ర‌శాంత్ కిషోర్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments