రాహుల్ పై పీకే షాకింగ్ కామెంట్స్
విభజన రాజకీయాలు మాట్లాడితే ఎలా
న్యూఢిల్లీ – భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్ వేశారు.
ఓ వైపు భారతీయ జనతా పార్టీని విజయ పథంలో నడిపించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నీ తానై ముందుకు వెళుతున్నారని ప్రశంసించారు. అంతే కాదు మోదీ దేశ ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ , ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల గురించి ప్రసంగాలు చేస్తున్నారని, ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారని పేర్కొన్నారు.
అయితే రాహుల్ గాంధీ మాత్రం వీటి గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదని ఎద్దేవా చేశారు ప్రశాంత్ కిషోర్. కులం, రిజర్వేషన్లు, ముస్లిం, క్రిష్టియన్లంటూ విభజన రాజకీయాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ప్రశాంత్ కిషోర్.
మోదీ, రాహుల్ గాంధీ మధ్య వ్యత్యాసం ఇదేనని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్దిని కోరుకుంటారు కానీ కులాన్ని, మతాన్ని ప్రాతిపదికగా తీసుకోరని స్పష్టం చేశారు . తాజాగా పీకే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.