NEWSANDHRA PRADESH

ఏపీలో జ‌గ‌న్ గెల‌వ‌డం క‌ష్టం

Share it with your family & friends

స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్

న్యూఢిల్లీ – ఇండియ‌న్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. గ‌తంలో ఆయ‌న ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌వ‌ర్ లోకి రావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. కానీ ఉన్న‌ట్టుండి ఆయ‌న ప్లేటు ఫిరాయించాడు. ఆపై ప్ర‌త్య‌ర్థి అయిన , ప్ర‌తిప‌క్ష నేత‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు వైపు మొగ్గు చూపారు.

ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా , ఎన్ని కుట్ర‌లు చేసినా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని కామెంట్స్ చేయ‌డం క‌ల‌కలం రేపింది. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని ఈ విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

తాము చేప‌ట్టిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెలుగులోకి వ‌చ్చాయ‌న్నారు. కోట్లాది రూపాయ‌లు సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ల‌బ్దిదారుల‌కు మేలు చేకూర్చినా తాను మాత్రం ప్యాలెస్ లో ఉంటే స‌రి పోతుందా అని ప్ర‌శ్నించారు. ఇది కాదు ప్ర‌జ‌లు కోరుకున్న పాల‌న అని పేర్కొన్నారు ప్ర‌శాంత్ కిషోర్.

రాష్ట్రంలో పూర్తిగా మార్పు క‌నిపిస్తోంద‌ని, త్వ‌ర‌లో జ‌రిగే శాస‌న స‌భ‌, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీ కూట‌మికి ఎడ్జ్ క‌నిపిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.